capsicum stuffed curry By , 2014-07-18 capsicum stuffed curry capsicum stuffed curry very yummi recipe, best combination rice or roti..easy to prepare... Prep Time: Cook time: Ingredients: 1 టేబుల్ స్పూన్ బెల్లం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు, కొద్దిగ కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, చిటికెడు పసుపు, 4 టేబుల్ స్పూన్లు నూనె, 3 టీ స్పూన్లు కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 ఉల్లిపాయలు, 7 క్యాప్సికం, Instructions: Step 1 క్యాప్సికం తొడిమలు కట్ చేసి పక్కనపెట్టాలి. Step 2 స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. Step 3 ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి తురుము వేసి వేయించాలి. తరువాత శెనగపిండి జల్లి గరిటతో బాగాకలపాలి. Step 4 ఇప్పుడు చింతపండు గుజ్జు, బెల్లంపొడి వేసి ఐదునిముషాలు వేయించి కొత్తిమీర వేసి దించాలి. Step 5 ఈ కూరను క్యాప్సికంలలో పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెపెట్టి నూనె వేసి ఒక్కొక్క క్యాప్సికంను నూనెలో పెట్టాలి. అలా అన్ని క్యాప్సికంలు పెట్టి మూతపెట్టి చిన్నమంటమీద పావుగంట ఉడికించి దించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day