meal maker biryani recipe By , 2017-05-17 meal maker biryani recipe Here is the process for meal maker biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మీల్ మేకర్ - 1 కప్పు,,బాస్మతి బియ్యం - 4 కప్పులు,,క్యారెట్ ముక్కలు - 1/4 కప్పు,,పచ్చి బఠానీలు - 1/4 కప్పు,,ఉల్లిపాయ - 1,,పచ్చిమిర్చి -3,,టమాటా -1,,పసుపు -1/4 టీ స్పూన్,,కారంపొడి -1 టీ స్పూన్,,గరం మసాలా పొడి - 1/4 టీ స్పూన్,,లవంగాలు -4,,యాలకులు -4,,దాల్చిన చెక్క - చిన్న ముక్క,,షాజీరా - 1 టీ స్పూన్,,అల్లంవెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్,,నూనె - 2 టీ స్పూన్స్,,నెయ్యి లేదా డాల్డా - 2 టీ స్పూన్స్, Instructions: Step 1 నాలుగు కప్పుల నీళ్లను మరిగించి అందులో మీల్‌మేకర్ వేసి ఉంచాలి.  Step 2 చల్లారాక నీరంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక మీల్‌మేకర్‌ను వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 బాస్మతి బియ్యం కడిగి నీళ్లు పోసి పది నిమిషాలు నాననివ్వాలి. Step 4 ఒక మందపాటి గిన్నె లేదా పాన్‌లో నూనె, నెయ్యి లేదా డాల్డా కలిపి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి.   Step 5 ఇందులో అల్లంవెల్లుల్లి ముద్ద, క్యారెట్ ముక్కలు, బఠానీలు, లవంగాలు, యాలకులు, దాల్చిన, షాజీర వేసి మరో రెండు నిమిషాలు వేపాలి.   Step 6 ఇప్పుడు పసుపు, కారం పొడి, గరం మాసాలా పొడి వేసి కలిపి ఆరు కప్పుల నీళ్లుపోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.   Step 7 ఆ వెసట్లో నీటిని వడకట్టి బియ్యం వేయాలి. మంట కొంచెం తగ్గించి ముప్పావు ఉడికిన అన్నంలో వేయించిన మీల్ మేకర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటమీద మగ్గనివ్వాలి.   Step 8 కొత్తిమీరతో అలంకరించి పెరుగు పచ్చడి లేదా కుర్మాతో ఈ మీల్‌మేకర్ బిర్యానీని సర్వ్‌చేయండి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day