baby corn pulao recipe By , 2017-05-15 baby corn pulao recipe Here is the process for baby corn pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - ఒక కప్పు,,బేబీకార్న్లు - పన్నెండు,,ఉల్లిపాయ - ఒకటి,,కొబ్బరి పాలు (పలుచగా) - రెండు కప్పులు,,బిర్యానీ ఆకు - ఒకటి,,పసుపు - చిటికెడు,,దాల్చిన చెక్క - చిన్న ముక్క,,లవంగాలు - మూడు,,యాలక్కాయలు - రెండు,,ఉప్పు - సరిపడా,,నూనె లేదా నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు., ,గుజ్జు కోసం:,కొత్తిమీర కట్టలు - రెండు,,వె ల్లుల్లి (చిన్నవి) - ఐదు,,అల్లం - చిన్న ముక్క,,కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి - నాలుగు,,గరం మసాలా పొడి - పావు టీస్పూన్., Instructions: Step 1 బియ్యాన్ని కనీసం అర గంట నానపెట్టాలి. ఉల్లిపాయని నిలువు ముక్కలుగా కోసుకోవాలి. Step 2 బేబీకార్న్ను కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. Step 3 ఒకవేళ బేబీకార్న్ను పలుచగా గుండ్రటి ముక్కలుగా కోసుకుంటే కనుక కుక్కర్లో ఉడికించాల్సిన అవసరం లేదు. Step 4 గుజ్జుకోసం కావాల్సిన పదార్ధాలన్నింటినీ మిక్సీలో తక్కువ నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.   Step 5 పులావ్ను కుక్కర్లో నేరుగా వండుతుంటే కనుక అందులోనే నూనె వేడిచేసి బిర్యానీఆకు, దాల్చినచెక్క, యాలక్కాయ, లవంగాలను వేసి వేగించాలి.   Step 6 తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగించి బేబీకార్న్, రుబ్బిన మసాల వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి.   Step 7 ఇందులో నానపెట్టిన బియ్యం వేసి ఒక నిమిషం పాటు ఉంచి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి.    Step 8 తరువాత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నటి మంట మీద పదినిమిషాల పాటు విజిల్ పెట్టకుండా ఉడికించాలి.    Step 9 అంతే పులావ్ రెడీ. వేడివేడి పులావ్ని ఉల్లిపాయ రైతాతో లేదా నచ్చిన ఇంకేదైనా రైతాతో తినొచ్చు.        
Yummy Food Recipes
Add