kadai paneer recipe By , 2017-05-08 kadai paneer recipe Here is the process for kadai paneer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పనీర్ - 100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి),క్యాప్సికం ముక్కలు - పావుకప్పు,ఉల్లితరుగు - పావుకప్పు,ఉల్లిముక్కలు - అరకప్పు (పెద్దవిగా తరగాలి),టొమాటో తరుగు - అరకప్పు,పసుపు - చిటికెడు,కొత్తిమీర - కట్ట,పచ్చిమిర్చి - 5,మిరియాల పొడి - అరటీస్పూన్,గరం మసాలా - అరటీస్పూన్,ఉప్పు - తగినంత,నల్ల ఉప్పు - చిటికెడు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్,షాజీరా - పావుటీస్పూన్,,డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం :,పల్లీలు - 10 గ్రా.,జీడిపప్పు - 4 లేదా 5 పలుకులు,కర్బూజా గింజలు - 10 గ్రా.,బాదం పప్పు - 10 గ్రా.,నూనె - 5 గ్రా., Instructions: Step 1 ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి డ్రై ఫ్రూట్స్ గ్రేవీ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. Step 2 అదే బాణలిలో నూనె పోసి కాగాక, షాజీరా, ఎండు మిర్చి, ఉల్లితరుగు వేసి దోరగా వేయించాలి.  Step 3 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. Step 4 టొమాటో తరుగు, మిగిలిన పదార్థాలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.    Step 5 నూనె పైకి తేలుతున్నపుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి.   Step 6 బాగా వేగిన తర్వాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి.   Step 7 కడాయిలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day