Shakarkandi recipe By , 2017-05-06 Shakarkandi recipe Shakarkandi , Food, food recipes Prep Time: 10min Cook time: 20min Ingredients: పన్నీర్ ముక్కలు - కప్పు,చిలగడ దుంపలు - అరకప్పు (ఉడికించి తురుముకోవాలి),అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచ,గరం మసాలా - అర చెంచ,ఉప్పు - తగినంత,కొత్తిమీర - కొంచెం,నూనె - రెండు టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు,టొమాటో ముక్కలు - పావు కప్పు,పచ్చి బఠానీ - పావు కప్పు,కారం - రెండు స్పూన్లు,జీడిపప్పు - కొన్ని, Instructions: Step 1 చిలగడ దుంపలు, పన్నీర్ ను ఒకే సైజ్ లో ముక్కల్లా చేసుకోవాలి. Step 2 పన్నీర్ ముక్కలని టేబుల్ స్పూన్ నూనెలో దోరగా వేయించుకొని తీసుకోవాలి. Step 3 మిగిలిన నూనెను బాణలిలో వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి.  Step 4 అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కల్ని వేయాలి.    Step 5 అవి కొద్దిగా మెత్తగా అయ్యాక చిలగడ దుంప ముక్కలూ, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టేయాలి.    Step 6 నీళ్ళు మరుగుతున్నపుడు పచ్చి బఠానీ వేసి మళ్లీ మూత పెట్టేయాలి.    Step 7 అవి ఉడికాక పన్నీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి.   Step 8 రెండు లేక మూడు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి, జీడిపప్పుతో అలంకరించుకుంటే చపాతీలు, పూరీలూ, ఇతర రోటీల్లోకి కూర సిద్దం.            
Yummy Food Recipes
Add
Recipe of the Day