Thalipeeth recipe By , 2017-05-01 Thalipeeth recipe Here is the process for Thalipeeth making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమ పిండి - కప్పు,బియ్యప్పిండి - అరకప్పు,సెనగ పిండి - పావుకప్పు,జొన్న పిండి - అరకప్పు,అల్లం - చిన్న ముక్క,వెల్లుల్లి రెబ్బలు - 2,పచ్చిమిర్చి - 3,ధనియాల పొడి - 2 టీస్పూన్లు,కసూరి మెంతి - టీస్పూన్,అవిసె గింజల పొడి - టీస్పూన్,గరం మసాలా - టీస్పూన్,ఉప్పు - రుచికి సరిపడా,జీలకర్ర - టీస్పూన్,నూనె - వేయించడానికి సరిపడా,కారం - 2 టీస్పూన్లు,పసుపు - అర టీస్పూన్,వాము - అరటీస్పూన్,కొత్తిమీర తురుము - కప్పు,నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు,ఉల్లి తురుము - అరకప్పు, Instructions: Step 1 అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బాలి. కొత్తిమీర సన్నగా తరగాలి. Step 2 నువ్వులు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి కలపాలి.  Step 3 తరువాత తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలపాలి. Step 4 ఇప్పుడు పిండి ముద్దను చపాతీ కర్రతో పాలిథీన్ కవర్ మీద గానీ లేదా నున్నని పాలరాయి మీద గానీ నూనె లేదా నెయ్యి అద్దుతూ చపాతీలా చేయాలి.    Step 5 రొట్టె చేసాక గారే మాదిరిగా మద్యలో రంద్రం చేసి పైన నువ్వులు చల్లి నెమ్మదిగా అద్దాలి.   Step 6 ఇప్పుడు పెనం మీద ఈ రొట్టె వేసి చిల్లులో అరటీస్పూన్ నూనె వేసి మూతపెట్టాలి.   Step 7 రెండు లేక మూడు నిమిషాల తర్వాత రొట్టెను తిప్పి మళ్లీ అదే మాదిరిగా మధ్యలో పావుటీస్పూన్ నూనె వేసి మూతపెట్టి కాలనివ్వాలి.    Step 8 రెండోవైపు తిప్పిన తర్వాత నువ్వులు గోధుమ రంగులోకి మారగానే రొట్టె తీయాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి.    Step 9 ఇది చాలా రుచిగా ఉండడమే కాక మంచి పోషకాహారం కూడా.      
Yummy Food Recipes
Add
Recipe of the Day