Coconut payasam recipe By , 2017-04-11 Coconut payasam recipe Here is the process for Coconut payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొబ్బరి ముక్కలు - ఒక కప్పు,జీడిపప్పు - అర కప్పు,పాలు - మూడు కప్పులు,చక్కెర - అర కప్పు,యాలకుల పొడి - ఒక టీ స్పూన్,నెయ్యి - ఒక టీ స్పూన్, Instructions: Step 1 కొన్ని జీడిపప్పులను తీసి వేయించి పక్కన పెట్టాలి.   Step 2 మిగతా జీడిపప్పును గంటపాటు వేడి నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పప్పులు మెత్తగా అవుతాయి. Step 3 వీటిని కొబ్బరి ముక్కలతో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. కొన్ని పాలు పోసి గ్రైండ్ చేస్తే మరింత మెత్తగా అవుతుంది. Step 4 మిగిలిన పాలను ఒక కడాయిలో పోసి వేడి చేయాలి. కొద్దిగా వేడయ్యాక కొబ్బరి, జీడిపప్పు పేస్ట్‌ని వేసి బాగా కలపాలి.   Step 5 20నిమిషాల పాటు అలాగే కలుపుతుండాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి మరికాసేపు అలాగే ఉంచాలి.   Step 6 దీనిపై వేయించిన జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. నోరూరించే... కొబ్బరి పాయసం రెడీ!                         
Yummy Food Recipes
Add
Recipe of the Day