oats idly recipe By , 2017-03-31 oats idly recipe Here is the process for oats idly making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ - ఒక కప్పు, రవ్వ - అర కప్పు, పెరుగు - అర కప్పు, పసుపు - పావు టీ స్పూన్, కొత్తిమీర - అర కట్ట, బేకింగ్ సోడా - కొద్దిగా, పచ్చిమిరపకాయలు - 2, అల్లం పేస్ట్ - అర టీ స్పూన్, మినపప్పు - అర టీ స్పూన్, ఆవాలు - అర టీ స్పూన్, ఇంగువ - కొద్దిగా, కరివేపాకు - 4 రెమ్మలు, నూనె - 2 స్పూన్, ఉప్పు - తగినంత, Instructions: Step 1 ఓట్స్‌ని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. రెండు నిమిషాల పాటు సన్నని సెగ మీద రవ్వను కూడా వేయించాలి.  Step 2 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలను వేయాలి.  Step 3 తర్వాత మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, అల్లం పేస్ట్ వేసి రెండు నిమిషాలు అలాగే ఉంచి దించేయాలి.  Step 4 ఇందులో వేయించుకున్న రవ్వ, ఓట్స్ పొడి వేసి కలపాలి.  Step 5 ఇంకా పెరుగు, పసుపు, బేకింగ్ సోడా, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్ళు కూడా పోసి మరికాసేపు కలిపి అరగంట పాటు అలాగే ఉంచాలి.  Step 6 ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక్కో ప్లేటుకు నూనె రాసి ఆ మిశ్రమాన్ని అందులో వేయాలి.  Step 7 అలా అన్ని రాసిన తర్వాత మూత పెట్టి 10నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఓట్స్ ఇడ్లీలు తయారైనట్టే!  
Yummy Food Recipes
Add