mango semiya upma recipe By , 2017-03-24 mango semiya upma recipe Here is the process for mango semiya upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఒకటిన్నర కప్పు సేమ్యా, (నేతిలో ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొన్నది.),మూడు లేక నాలుగు పచ్చి మిరపకాయలు,అల్లం చిన్న ముక్క తరిగినది.,తొక్కు తీసి తురిమిన మామిడి కోరు -,మూడొంతుల కప్పు కాజు,నూనె తగినంత,నెయ్యి తగినంత,పోపు పెట్టుకోవడానికి తగినన్ని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు., Instructions: Step 1 నాలుగు కప్పుల నీటిలో ఒక చెంచా నూనె, ఒక అర చెంచా ఉప్పు వేసి, సేమ్యాను మెత్తగా ఉడికించుకోవాలి. Step 2 సేమ్యా ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి. మెత్తగా ఉడికిన సేమ్యాను వార్చుకొని, చల్ల నీరు చల్లి, ఒక పక్కకు పెట్టుకోవాలి. Step 3 ఒక బాణెలిలో రెండు చెంచాల నూనె వేసుకొని, కొంచం వేడి కాగానే ఆవాలు వేసి, చిట పటలాడనిచ్చుకోవాలి. Step 4 దీనికి మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసుకొని, చక్కగా వేగనివ్వాలి. దీనికి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం కోరు తగిలించి వేగనివ్వాలి. Step 5 ఇప్పుడు దీనికి మామిడికాయ కోరు కలుపుకొని రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి. దీనికి తగినంత ఉప్పు వేసి (సేమ్యాలో ఒక సారి వేసుకున్న విషయం మర్చిపోవద్దు సుమా!) కలుపుకోవాలి. Step 6 దీనిలో సేమ్యా వేసుకొని, మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఎక్కడా ముద్దలు కాకుండా చూసుకోవాలి. Step 7 ఒకసారి ఇప్పుడు ఉప్పు సరి చూసుకోండి, అంతే పుల్ల పుల్లని మామిడి సేమ్య ఉప్మా తయార్!
Yummy Food Recipes
Add
Recipe of the Day