poornam burelu recipe By , 2017-03-16 poornam burelu recipe Here is the process for poornam burelu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపప్పు - ముప్పావు కప్పు,బెల్లం - ఒక కప్పు,తాజా కొబ్బరి తురుము - 3 టేబుల్‌ స్పూన్లు,యాలకుల పొడి - చిటికెడు,బియ్యంపిండి - ఒకటిన్నర కప్పు, నీళ్లు - తగినన్ని,నెయ్యి - 1 టీ స్పూన్‌, ఉప్పు - చిటికెడు, Instructions: Step 1 శనగపప్పు మునిగేంత వరకు నీరు పోసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. Step 2 పప్పు మరీ మెత్తగా కాకుండా వేళ్లతో నొక్కితే చితికేంత మేరకే ఉడికించుకోవాలి. Step 3 తడిలేకుండా చూసుకోవాలి. తర్వాత పప్పును చల్లార్చి పొడి చేసుకోవాలి. గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టాలి. Step 4 పాకంలో శనగపప్పు పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. Step 5 మిశ్రమం పిండి ముద్దగా మారాక మంట తీసేయాలి. పూర్తిగా చల్లారాక ఉండలు కట్టుకుని పక్కనుంచుకోవాలి. Step 6 నీళ్లు, నెయ్యి, ఉప్పు కలిపి మరిగించుకోవాలి. బియ్యంపిండిని ఓ గిన్నెలో తీసుకుని మరిగించిన నీటిని చేర్చుతూ పిండి కలుపుకోవాలి. Step 7 2 నిమిషాలాగి వేడిగా ఉన్నప్పుడే పిండి మెత్తబడే వరకూ పిసుక్కోవాలి. చేతికి నూనె పూసుకుని పిండిని ఉండలుగా చేసుకోవాలి. Step 8 ఉండలను చేత్తో చిన్న పూరీల్లా వత్తుకుని వాటి మధ్యలో శనగ ఉండను ఉంచి గుండ్రంగా చుట్టాలి. Step 9 ఇలా తయారుచేసిపెట్టుకున్న కుడుములను 10 -12 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించి చల్లారాక వడ్డించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day