Chicken Cutlet Recipe By , 2017-02-02 Chicken Cutlet Recipe Here is the process for Chicken Cutlet Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ ( బోన్ లెస్ ) : అరకేజీ,బాయిల్చేసిన ఆలు : రెండు,ఉల్లిపాయముక్కలు : పావుకప్పు,పచ్చిమిర్చి ముక్కలు : రెండు స్పూన్లు,కర్వేపాకు : రెండు రెమ్మలు,అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్,ధనియా పొడి : ఒక స్పూన్,జీలకర్ర పొడి : ఒక స్పూన్,కారం : ఒక స్పూన్,పసుపు : అరస్పూన్,సాల్ట్ : తగినంత,గరం మసాలా : ఒక స్పూన్,మైదా : అరకప్పు,బ్రెడ్ క్రామ్స్ పొడి : అరకప్పు,నిమ్మకాయ రసం : ఒక స్పూన్,కొత్తిమీర : కొద్దిగా,ఆయిల్ : డీప్ ఫ్రై కి సరిపడా, Instructions: Step 1 ముందుగా చికెన్ ను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కీమా లాగా కట్ చేసుకుని శుభ్రం గా కడిగి పక్కనపెట్టుకోవాలి . Step 2 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఉల్లిపాయముక్కలు , కర్వేపాకు , పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి , వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ కీమా వేసుకుని కలిపి మగ్గాక అందులో సాల్ట్ , పసుపు , కారం , ధనియాల పొడి , జీలకర్రపొడి , గరం మసాలా అన్ని వేసి బాగా వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ రసం , కొత్తిమీర వేసి ఒక సారి కలిపి దించుకోవాలి . Step 3 ఇపుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఉడకపెట్టుకున్న ఆలు గడ్డను వేసి బాగా మెదుపుకోవాలి , అందులో చికెన్ మిశ్రమం వేసి బాగా కలిపి చిన్న చిన్న బాల్ లాగా చేసుకుని చేత్తో వత్తుకుని ఆలా అన్ని చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి . Step 4 ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో మైదా, కొంచెం వాటర్ వేసి కలిపి బజ్జిపిండి లాగ కలిపి పెట్టుకోవాలి, వేరే ప్లేట్ లో బ్రేడ్ క్రామ్స్ పొడి వేసి పెట్టుకోవాలి , ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ టిక్కా లను ముందుగా మైదా పిండి లో ముంచి తర్వాత బ్రేడ్ క్రామ్స్ పొడి లో దొర్లించుకోవాలి, ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి . Step 5 స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి కాగాక అందులో ఈ చికెన్ టిక్కా లను ఒక్కొకటి చొప్పున వేసుకుని రెండు వైపులా దోర గా వేయించుకుని పేపర్ పరిచిన ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి …
Yummy Food Recipes
Add
Recipe of the Day