Kakara Sabji recipe By , 2017-02-18 Kakara Sabji recipe Here is the process for Kakara Sabji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాకరకాయలు - అరకిలో,,ఉల్లిపాయలు - రెండు,,పచ్చిమిరపకాయలు - నాలుగు,,ఎండుమిరపకాయలు - మూడు,,ధనియాలు - ఒక టేబుల్ స్పూను,,శెనగపప్పు - పావు కప్పు,,జీలకర్ర - రెండు టీ స్పూన్లు,,వెల్లుల్లి రేకలు - నాలుగు,,కరివేపాకు - రెండు రెబ్బలు,,చింతపండు - 20 గ్రాములు,,పసుపు - కొద్దిగా ,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా ఎండుమిరపకాయలు, శెనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేగించుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 కాకరకాయని పొట్టు తీసి చక్రాలుగా కోసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి ఒక పెద్దగ్లాసు చింతపండు నీళ్లు పోసి వేడెక్కాక అందులో కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. Step 3 నీళ్లన్నీ పోయాక దించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. Step 4 తర్వాత ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి సన్ననిమంటపై మగ్గనివ్వాలి. దించేముందు శెనగపప్పు పొడి వేసి బాగా కలపి దించేయాలి. తీపిని ఇష్టపడేవారు శెనగపప్పు పొడి బదులు కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day