Mysore Rasam Recipe By , 2017-02-08 Mysore Rasam Recipe Here is the process for Mysore Rasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కందిపప్పు : 50 గ్రాములు,చింత పండు రసం :ఒక కప్పు,టమోటో ముక్కలు : అర కప్పు,పసుపు : చిటికెడు,ఇంగువ : చిటికెడు,బెల్లం : చిన్న ముక్క,కర్వేపాకు : ఒక రెమ్మ,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడంతా,కొత్తిమీర : కొంచెం,మసాలా పొడి కోసం:,శనగపప్పు : ఒక స్పూన్,ధనియాలు : ఒక స్పూన్,జీలకర్ర : ఒక స్పూన్,మిరియాలు : ఒక ఆరు,ఎండుమిర్చి : నాలుగు,ఎండుకొబ్బరి తురుము : ఒక స్పూన్, Instructions: Step 1 ముందుగా పప్పు ని కడిగి నీరు పోసి అరగంట నాననిచ్చి ఉడక పెట్టుకుని పక్కనపెట్టుకోవాలి . Step 2 మైసూర్ మసాలా పొడి : Step 3 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి తురుము అన్ని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మిక్స్ జార్ లో తీసుకుని చల్లారాక మెత్తగా పొడి చేసుకొవాలి . Step 4 మరల స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో టమోటో ముక్కలు, చింత పండురసం, పసుపు, కర్వేపాకు, బెల్లం, సాల్ట్ వేసి కలిపి ఉడకనివ్వాలి . Step 5 ఉడికాక అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ను వేసి కలిపి కొంచెం నీరు పోసి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి . Step 6 అందులో ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి మరో 5 నిముషాలు మరగనిచ్చి దించుకోవాలి .
Yummy Food Recipes
Add
Recipe of the Day