Rava Pongal Recipe By , 2017-02-03 Rava Pongal Recipe Here is the process for Rava Pongal Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బొంబాయి రవ్వ : ఒక కప్పు,పెసరపప్పు : పావు కప్పు,సాల్ట్ : తగినంత,నెయ్యి : మూడు స్పూన్లు,జీడిపప్పు : ఆరు,మిరియాలు : ఒక స్పూన్,శనగపప్పు : అరస్పూన్,మినపప్పు : అరస్పూన్,జీలకర్ర : ఒక స్పూన్,కర్వేపాకు : ఒక రెమ్మ,పచ్చిమిర్చి ముక్కలు : రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో రవ్వ వేసి దోరగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.. Step 2 ఇప్పుడు అదే పాన్ లో ఇంకొంచెం నెయ్యి వేసి పెసరపప్పు వేసి బాగా వేయించుకుని అందులో మూడు గ్లాస్ ల నీరు వేసి మరగనివ్వాలి, మరిగాక సాల్ట్ వేసి కలిపి వేయించుకున్న రవ్వ కూడా వేసి కలిపి మూతపెట్టి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి , ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి. Step 3 తరువాత వేరే చిన్న పాన్ పెట్టుకుని అందులో మిగిలిన నెయ్యి వేసి వేడి ఎక్కాక అందులో జీడిపప్పు , శనగపప్పు , మినపప్పు , మిరియాలు , జీలకర్ర, వేసి వేగనివ్వాలి… వేగాక పచ్చిమిర్చిముక్కలు, కర్వేపాకు వేసి మరి కాసేపు దోరగా వేయించి దించుకోవాలి, ఇప్పుడు ఈ తాలింపు ను ముందుగా ఉడికించుక్కలున్న పొంగల్ లో వేసి కలిపి సర్వే చేసుకోవాలి… అంతే వేడి వేడి కమ్మని రవ్వ పొంగల్ రెడీ …
Yummy Food Recipes
Add
Recipe of the Day