Rajma Matar Pulao Recipe By , 2017-02-02 Rajma Matar Pulao Recipe Here is the process for Rajma Matar Pulao Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: బాస్మతి రైస్ : ఒక కప్పు,ఉడికించిన రాజ్మా : పావు కప్పు,మట్టర్ ( పచ్చిబఠాణీ ) : పావు కప్పు,ఉల్లిపాయ ముక్కలు : రెండు స్పూన్లు,పచ్చిమిర్చి చీలికలు : రెండు,కర్వేపాకు : ఒక రెమ్మ,పుదీనా : కొంచెం,కొత్తిమీర : కొంచెం,కర్వేపాకు :ఒకరెమ్మ,అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్,షాజీరా : ఒక స్పూన్,బిరియాని ఆకూ : రెండు,లవంగం : నాలుగు,ఇలాచీ : నాలుగు,చెక్క : చిన్న ముక్క,కారం : అరస్పూన్,పసుపు : చిటికెడు,గరం మాసాల : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,జీడిపప్పు : ఆరు,నెయ్యి : రెండు స్పూన్లు,ఆయిల్ : రెండు స్పూన్లు, Instructions: Step 1 బాస్మతి రైస్ ను ముందుగా కడిగి ఒక అరగంటపాటు నాననివ్వాలి . Step 2 స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి మరగనివ్వాలి , మరిగాక అందులో షాజీరా , బిరియాని ఆకూ , లవంగం, ఇలాచీ , చెక్క , సాల్ట్ , ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి అందులో ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఉడికించుకోవాలి . ఉడికాక ఒక జల్లెడ దాంట్లో వేసుకుని వాడకట్టుకోవాలి, దానిపైన చల్లని వాటర్ వేసుకుని ఉంచుకోవాలి, ఇలా చేస్తే రైస్ పొడి పొడి గా ఉంటుంది . Step 3 ఇప్పుడు పాన్ పెట్టుకుని అందులో నెయ్యి ,కొంచెం ఆయిల్ వేసుకుని వేడి ఎక్కాక అందులో జీడిపప్పు , ఉల్లిపాయముక్కలు వేసి , బ్రౌన్ రంగు వచ్చేవరకు వేగనివ్వాలి. Step 4 ఇందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ , పచ్చిమిర్చిచీలికలు , కర్వేపాకు , పసుపు వేసి వేగనివ్వాలి. వేగాక అందులో ఉడికించుకున్న రాజ్మా , మట్టర్ (బఠాణీ ) వేసుకుని మరికాసేపు వేపి అందులో పుదీనా , కొత్తిమీర, కారం, తగినంత సాల్ట్ వేసి కలిపి ఇందులో ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుకుని గరం మసాలా వేసి టాస్ చేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి..
Yummy Food Recipes
Add
Recipe of the Day