Meal maker Senagapappu Masala Curry Recipe By , 2017-02-02 Meal maker Senagapappu Masala Curry  Recipe Here is the process for Meal maker Senagapappu Masala Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మిల్ మేకర్ : ఒక కప్పు,పచ్చిశనగపప్పు : అరకప్పు,బిరియాని ఆకూ : రెండు,ఉల్లిపాయమిక్కలు : పావుకప్పు,టమోటోముక్కలు : పావుకప్పు,పచ్చిమిర్చి చీలికలు : రెండు,కర్వేపాకు : ఒక రెమ్మ,అల్లంవెల్లుల్లిపేస్ట్ : ఒక స్పూన్,పసుపు : చిటికెడు,కారం : ఒక స్పూన్,ధనియాల పొడి : ఒకస్పూన్,జీలకర్రపొడి : ఒక స్పూన్,గరం మసాలా పొడి : ఒక స్పూన్,కొత్తిమీర : కొద్దిగా,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడా, Instructions: Step 1 ముందుగా శనగపప్పు ను కడిగి ఒక గంట పాటు నాననివ్వాలి , మిల్ మేకర్ ను వేడి నీళ్ళల్లో వేసుకుని పది నిముషాలు ఉంచి నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి . Step 2 స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి వేడి ఎక్కాక బిరియాని ఆకూ వేసి వేపాలి. వేగాక ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చి , కర్వేపాకు వేసి బాగా వేగనివ్వాలి Step 3 ఇందులో అల్లంవెల్లుల్లిపేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకుని నానపెట్టిన శనగపప్పు ను వేసి కలిపి ఒక పది నిముషాలు పాటు చిన్న మంటమీద ఉడకనివ్వాలి , ఉడికాక పసుపు , కారం , ధనియాల పొడి , జీలకర్రపొడి, వేసి మరికాసేపు వేయించుకుని అందులో టమోటో ముక్కలు వేసి కలిపి మూతపెట్టి చిన్న మంటమీద మగ్గనివ్వాలి. Step 4 మగ్గాక అందులో మిల్ మేకర్ , తగినంత సాల్ట్ , ఒక కప్పు నీరు పోసుకుని ఉడకనివ్వాలి , దగ్గరకు అయ్యాక గరం మసాలా వేసుకుని ఒక రెండు నిముషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని దించుకోవాలి ..
Yummy Food Recipes
Add
Recipe of the Day