Royyala Biryani Recipe By , 2017-01-23 Royyala Biryani Recipe Here is the process for Royyala Biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour 20min Ingredients: బాస్మతి బియ్యం- ఒక కేజీ,,రొయ్యలు- కేజీన్నర,,పెరుగు- 200 గ్రాములు,,నిమ్మరసం- మూడు టీస్పూన్లు,కారంపొడి- 20 గ్రాములు,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు,,ఉప్పు- 50 గ్రాములు,,గరంమసాలా- 20 గ్రాములు,,రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు,,వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి) - 30 గ్రాములు,,జీడిపప్పు - కొద్దిగా,,కొత్తిమీర తరుగు - 15 గ్రాములు,,పుదీనా తరుగు - 15 గ్రాములు,,బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు,,డాల్డా లేదా నెయ్యి- 150 గ్రాములు,,నీళ్లు- 5 లీటర్లు, Instructions: Step 1 ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి కలపాలి. Step 2 దీన్ని రెండు నుంచి మూడు గంటలు నానబెట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు ఉడుకుపట్టాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి. Step 3 బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందు నానబెట్టిన రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. Step 4 వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను పొరలా పరవాలి. పైన నెయ్యి వేయాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. Step 5 ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. Step 6 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. Step 7 ఈ రొయ్యల బిర్యానీ ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా రుచిగా ఉంటుంది. అలా ఇష్టపడని వాళ్లు మిర్చి కా సలాన్‌ లేదా రైతాలతో బిర్యానీ లాగించేయచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day