Gongura mutton curry By , 2016-11-08 Gongura mutton curry here the preparation process for moth watering Gongura mutton curry. Just follow these steps and make delecious Gongura mutton curry Prep Time: 30min Cook time: 45min Ingredients: గోంగూర : 1 కట్ట(తరిగి పెట్టుకోవాలి),మటన్ : 1/2 kg,ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి),పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసుకోవాలి),అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp,పసుపు పొడి: 1tsp,కారం పొడి: 1tsp,ఉప్పు : రుచికి సరిపడా,గరం మసాల : 1tsp,జీలకర్ర: 1tsp,గ్రీన్ యాలకలు: 2-3,దాల్చిన చెక్క: 1,నూనె: 4tbsp,కొత్తిమీర : 2tbsp(గార్నిషింగ్ కోసం), Instructions: Step 1 ముందుగా గోంగూరను నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో గోంగూర ఆకులు వేయాలి. Step 2 పాన్ కు మూత పెట్టి మీడియం మంట మీద 5నిముషాలు మెత్తగా ఉడికించుకొని, పక్కన తీసి పెట్టుకోవాలి. Step 3 తర్వాత స్టౌ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 4 తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 5 ఇప్పుడు అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మటన్ ముక్కలు వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 6 తర్వాత అందులో ఉప్పు వేసి మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. Step 7 ఇప్పుడు మటన్ కు ఒక కప్పు నీళ్ళు జోడించి మిక్స్ చేసి మూత పెట్టి, లిడ్ కూడా అమర్చి, 4-5విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. Step 8 మటన్ ఉడికిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పాన్ లోకి మార్చుకొని, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. Step 9 ప్పుగు మాషర్ లేదా పప్పు కట్టింతో గోంగూరను మాష్ చేసుకోవాలి. లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day