Panasakaya Dum Biryani Recipe By , 2017-02-04 Panasakaya Dum Biryani Recipe Here is the process for Panasakaya Dum Biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 45min Ingredients: పనసకాయ ముక్కలు : ఒక కప్పు,బాస్మతి రైస్ : రెండు కప్పులు,అల్లం వెల్లుల్లిపేస్ట్ : ఒక స్పూన్,బిరియాని ఆకులు : మూడు,మరాఠి మొగ్గ : రెండు,షాజీరా : ఒక స్పూన్,స్టార్ : మూడు,ఇలాచీ : నాలుగు,చెక్క : చిన్న ముక్క,లవంగాలు : నాలుగు,ఉల్లిపాయముక్కలు : అరకప్పు,పచ్చిమిర్చి చీలికలు : నాలుగు,పుదీనా : అరకప్పు,కొత్తిమీర : అరకప్పు,కుంకుమపువ్వు : చిటికెడు,మిల్క్ : రెండు స్పూన్లు,నెయ్యి : మూడు స్పూన్లు,ఆయిల్ : తగినంత,గరం మసాలా పొడి : ఒక స్పూన్,కారం : ఒక స్పూన్,పసుపు : అరస్పూన్,సాల్ట్ : తగినంత,జీడిపప్పు : నాలుగు,పచ్చి కొబ్బరి ముక్క : చిన్నది,పెరుగు :ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా బాస్మతి రైస్ ను కడిగి అరగంటపాటు నాననివ్వాలి . Step 2 స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసి మరగనివ్వాలి , మరిగాక అందులో బిరియాని ఆకూ , షాజీరా , ఇలాచీ , లవంగం , సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి అందులో ముందుగా నానపెట్టిన రైస్ వేసి 70% ఉడకనివ్వాలి.. దీన్ని వడకట్టుకుని అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి . Step 3 ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పనసకాయ ముక్కలు , పసుపు , అల్లం వెల్లుల్లిపేస్ట్ , సాల్ట్ వేసి కలుపుకి పక్కన ఉంచుకోవాలి. Step 4 మిక్స్ జార్ తీసుకుని అందులో జీడిపప్పు , కొబ్బరిముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి . Step 5 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించుకుని తీసుకుని పక్కనపెట్టుకోవాలి. Step 6 ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి ,ఆయిల్ వేసుకుని అందులో బిరియాని ఆకూ వేసి అందులో గరం మసాలాదినుసులను కొంచెం దంచుకుని వేసుకోవాలి . Step 7 వేగాక అందులో, ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చిముక్కలు , వేసి వేపుకుని ముందుగా కలిపిపెట్టుకున్న పనసకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. Step 8 ఇప్పుడు ఇందులో జీడిపప్పు , కొబ్బరికాయ పేస్ట్, కారం ,సాల్ట్ , వేసి మరల కాసేపు మగ్గనివ్వాలి Step 9 మగ్గాక కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి కలిపి చిన్నమంటమీద 5 నిముషాలు ఉడకనివ్వాలి. Step 10 ఇప్పుడు దీనిమీద ముందుగా 70% ఉడికించుకున్న రైస్ వేసి పరుచుకోవాలి. Step 11 దాని పైన ముందుగా వేయించుకున్న ఉల్లిపాయముక్కలు ,కొంచెం కొత్తిమీర , పుదీనా , గరం మసాలా పొడి , పాలలో కలుపుకున్న కుంకుమ పువ్వు ను వేసుకుని దీనిపైనా కొంచెం నెయ్యి వేసుకుని కుక్కర్ మూతపెట్టి ఒక పది నిముషాలు చిన్నమంట పైన దమ్ చేసుకోవాలి , కుక్కర్ విజిల్ పెట్టకూడదు. Step 12 అంతే పనసకాయ దమ్ బిరియాని రెడీ … స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మూతతీసి వడ్డించుకోవాలి …
Yummy Food Recipes
Add