bitter gourd fry By , 2016-10-24 bitter gourd fry bitter gourd fry. Prep Time: 20min Cook time: 30min Ingredients: అర కేజీ కాకరకాయలు,వంద గ్రాముల శనగపిండి,1 టీ స్పూన్ కారం,అరకప్పు నూనె,అర టీ స్పూన్ పసుపు,తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా కాకరకాయలు నిలువుగా కట్ చేసి లోపలి గింజలు తీసి నాలుగు వైపులా కట్ చేసుకోవాలి (పూర్తిగా కాకుండా గుత్తి వంకాయలాగా మధ్యలో చీల్చి) కట్ చేసుకోవాలి. Step 2 ఈ కాకరకాయలను నీళ్లలో వేసి, పసుపు వేసి ఉడికించి నీళ్లు తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 శనగపిండిలో కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తడిపొడిగా కలపాలి. ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడికించిన కాకరకాయలలో కూరుకోవాలి (గుత్తి వంకాయలలో మసాల కూరినట్లు) Step 4 ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేయాలి కాకర కాయలు బాగా ఎర్రగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి చేదు లేకుండా తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. Step 5 రైస్ లోకి పప్పు, సాంబార్ లాంటి వాటికి తోడుగా దీనిని నంచుకుంటూ తింటుంటే... మ్ మ్ మ్.....
Yummy Food Recipes
Add