Gongura Paneer Curry By , 2016-10-25 Gongura Paneer Curry Gongura Paneer Curry Recipe. Prep Time: 20min Cook time: 30min Ingredients: ఆరు కట్టలు గోంగూర,100 గ్రా. పనీర్,కప్పు ఉల్లిపాయ ముక్కలు,ఆరు పచ్చిమిర్చి,ఆరు లవంగాలు,ఆరు ఏలకులు,చిన్నముక్కదాల్చిన చెక్క,ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద,రెండు రెమ్మలు కరివేపాకు,టీ స్పూన్ జీలకర్ర,అర టీ స్పూన్ పసుపు,తగినంత ఉప్పు,ఆరు టీ స్పూన్లు నూనె,రెండు టీ స్పూన్లు నెయ్యి,టీ స్పూన్ కారం,పది జీడిపప్పు , Instructions: Step 1 గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లుపోసి కాస్త వేడెక్కిన తర్వాత పనీర్ వేసి అయిదారు నిమిషాల తర్వాత తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరోపక్కన ఇంకో పాన్‌లో కొన్ని నీళ్లుపోసి గోంగూరను ఉడకపెట్టుకోవాలి. Step 2 బాణీలో నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు వేసి ఎరుపురంగు వచ్చేంత వరకు వేయించి చల్లారిన తర్వాత వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 తర్వాత గోంగూరను కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. Step 4 ఆపై అందులో గోంగూర పేస్ట్, పనీర్ ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు కప్పుల నీళ్లుపోసి తక్కువ సెగమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే గోంగూర పనీర్ సిద్ధమైనట్లే... Step 5 ఈ గోంగూర పనీర్‌ను రోటీలతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day