mutton paya recipe|non veg recipe|healthy non veg recipe. By , 2016-05-27 mutton paya recipe|non veg recipe|healthy non veg recipe. Mutton Paya or stew made from the legs of lamb which are also called as lamb trotters and this is a very healthy soup recipe. telugufoodrecipes.com Prep Time: 20min Cook time: 30min Ingredients: ఐదు ముక్కలు  మటన్ (ఎముక ముక్కలు),నాలుగు చెంచాలు   కారం పొడి,ఒక కప్పు  ఉల్లిపాయ తరుగు, అర కప్పు  పుదీనా ఆకులు,తగినంత  నూనె,అరకప్పు  కొత్తిమీర తరుగు, అర స్పూన్ ‌ యాలకుల పొడి,అరస్పూన్ ‌ లవంగాల పొడి,తగినంత‌ ఉప్పు,అర స్పూన్  అల్లం, వెల్లుల్లి పేస్ట్,అరకప్పు పచ్చి కొబ్బరి తురుము,అర స్పూన్‌  గరంమసాల పేస్ట్,సరిపడా‌  పసుపు,ఒక్కటి‌  నిమ్మకాయ,ఒక స్పూన్  గసగసాలు, Instructions: Step 1 ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొవాలి. తర్వాత గసగసాలు తురుముకున్న కొబ్బరి పొడిని తీసుకొని ముద్దలాగా చేసి వుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మటన్ ముక్కలు, కారం పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, తగినన్ని నీళ్లు పోసి చిన్న మంట మీద అరగటం ఉడికించాలి. Step 2 ఇప్పుడు మరొ పాత్ర తీసుకొని అందులో నూనె వేసి వేడి చేస్తూ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేగించుకొవాలి. Step 3 తర్వాత కారం, ధనియాలపొడి వేసి బాగా కలపిన తర్వాత ముందుగా ముద్ద చేసి ఉంచుకున్న గసగసాలు, కొబ్బరి ముద్దను వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. Step 4 ఇప్పడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని అంతటిని ఇందులో వేసి బాగా కలిపి పదినిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందకు దించిన తర్వాత తురుముకున్న కొత్తిమీరను చల్లుకొవాలి. అంతే హట్ హట్ గా ఉండే మటన్ పాయా రెడీ.
Yummy Food Recipes
Add