chicken Pulao|chicken Pulao recipe|special Pulao By , 2016-05-23 chicken Pulao|chicken Pulao recipe|special Pulao how to prepare in the tasty chicken Pulao, non veg item very special chicken Pulao. Prep Time: 20min Cook time: 30min Ingredients: ఒక గ్లాస్  బాస్మతి రైస్, పావుకిలో  చికెన్,ఒక్కటి  ఉల్లిపాయ,మూడు  పచ్చిమిర్చి,రెండు  టమాటాలు,ఒక కట్ట  కొత్తిమీర,ఒక కట్ట‌  పుదీనా,రెండు టీ స్పూన్స్‌  పెరుగు,రెండు టీ స్పూన్స్‌   గరంమసాలాపొడి,రెండు టీ స్పూన్స్‌  అల్లంవెల్లుల్లి పేస్ట్,తగినంత  ఉప్పు,పసుపు,కారం,నూనె,తగినన్ని  లవంగాలు, చెక్క, యాలకులు,తగినన్ని  మరాటీ మొగ్గ, అనాసపువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, Instructions: Step 1 బియ్యం కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, టమటాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో పెరుగులో అల్లంవెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ గరంమసాల పొడి, పుదీనా మిశ్రమం వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి చికెన్ వేసి కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకొవాలి. Step 3 ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని అందులో నూనె వేడిచేస్తూ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిముక్కలను, మసాలాదినుసులు వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు తరిగిన టమాటాముక్కలు వేసి ఇవి ఉడికిన తరువాత చికెన్ మిశ్రమం వేసి కలపాలి. Step 4 చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక స్పూన్ మసాలాపొడి వేసి కలిపి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. అంతే చికెన్ పలావ్ రెడీ. ఈ చికెన్ పలావ్ పెరుగు చట్నితో తింటే చాలా రుచికరముగా ఉంటుంది..
Yummy Food Recipes
Add