fish fry|healthy food recipe|special see foods telugu recipe By , 2016-05-23 fish fry|healthy food recipe|special see foods telugu recipe This Fish Fry Recipe is Easy & Famous Recipe in Andhra style www.telugufoodrecipe.com Prep Time: 15min Cook time: 30min Ingredients: అర కేజీ  చేపలు,రెండు   ఉల్లిగడ్డలు,ఐదు  పచ్చిమిర్చి,ఒక టీ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, 8  లవంగాలు,రెండు ముక్కలు దాల్చిన చెక్క,రెండు టీ స్పూన్లు‌  ధనియాలపొడి,రెండు స్పూన్లు  కారం,సరిపడా‌ ఉప్పు,తగినంత‌  పసుపు,డీప్ ఫ్రై చేయడానికి సరిపడా‌  నూనె, Instructions: Step 1 తాజా చేపలను ఒక బౌల్ లోకి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చేపలను శుభ్రంగా కడిగి చిన్నచిన్నముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొవాలి. Step 2 తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, అల్లంవెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొవాలి. Step 3 తర్వాత ఈ పేస్ట్ లో కారం, ఉప్పు, పసుపు, ధనియాలపొడి కలిపి కట్ చేసి పెట్టకున్న చేప ముక్కలకు రెండు వైపులా ఈ మసాలా మిశ్రమాన్ని పట్టించి రెండుగంటల వరకు నాన బెట్టి ఉంచాలి.. Step 4 ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో నూనె వేసి బాగా కాగిన తర్వాత నాన బెట్టుకున్న చేప ముక్కలను నూనెలో వేసి రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వేగించుకోవాలి. తర్వాత ఒకఫ్లేట్ లోకి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోవాలి. వీటిని వేడివేడి అన్నంలో కాని విడిగాతిన్నా చాలారుచికరముగా ఉంటాయి.
Yummy Food Recipes
Add