mushroom masala By , 2018-03-02 mushroom masala Here is the process for mushroom masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మష్రూమ్స్ - అర కేజీ,మొక్కజొన్న పిండి - అర కప్పు,ఉల్లి తరుగు - రెండు కప్పులు,టమోటా తరుగు - రెండు కప్పులు,కొబ్బరి తురుము - పావు కప్పు,పచ్చిమిర్చి - నాలుగు,మిరప పొడి - ఒక టీ స్పూన్,పసుపు పొడి - ఒక టీ స్పూన్,గరం మసాలా - ఒక టీ స్పూన్,ధనియాల పొడి - ఒక టీ స్పూన్,అల్లం- వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు,ఉప్పు, నూనె- తగినంత, Instructions: Step 1 ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్‌ ముక్కలకు అర స్పూన్ పసుపు, మిర్చి, గరం మసాలా, మొక్కజొన్న పిండి, ఉప్పు చేర్చి నానబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో నూనె పోయాలి.  Step 2 నూనె వేడయ్యాక మసాలా పట్టించిన మష్రూమ్ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లి, టమోటా తరుగును చేర్చి దోరగా వేపాలి.  Step 3 ఆపై పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, గసగసాల పేస్టును అందులో కలపాలి. Step 4 ఆపై గరం మసాలా, ధనియాల పొడి, పసుపు పొడి చేర్చి బాగా వేపుకోవాలి.    Step 5 మిశ్రమం బాగా వేగాక.. ఫ్రై చేసుకున్న మష్రూమ్‌ను చేర్చి ఐదు నిమిషాల పాటు ఉంచి ఉప్పు చేర్చి దించేయాలి.    Step 6 అంతే మష్రూమ్ మసాలా రెడీ అయినట్లే. ఈ మష్రూమ్ మసాలా చపాతీలకు సైడిష్‌గా టేస్ట్ అదిరిపోద్ది.          
Yummy Food Recipes
Add