Pudheena Korrala Rice, korrala special items, healthy recipes. By , 2016-05-18 Pudheena Korrala Rice, korrala special items,  healthy recipes. Learn how to cook Pudheena Korrala Rice,The cooking tips to make Pudheena Korrala Rice in Telugu, healthy cooking tips. Prep Time: 15min Cook time: 20min Ingredients: ఒకటిన్నర కప్పు  కొర్రలు,రెండు రెబ్బలు‌  పుదీనా ఆకులు,తగినంత  ఉప్పు,రెండు  ఉల్లిపాయలు,సరిపడినంత  నూనె,రెండు  టమోటా,ఐదు  పచ్చిమిర్చి,పది  జీడిపప్పు,ఒక టీస్పూన్  జీలకర్ర,తగినంత  పసుపు, Instructions: Step 1 ముందుగా కొర్రలను శుభ్రముగా కడిగి, ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మూడు కప్పుల నీళ్లు తీసుకొని, శుభ్రపరిచిన కొర్రలను అందులో వేసి స్టౌ వేలిగించుకొని మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. Step 2 ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటలను చిన్నచిన్నముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పూదీనా అకులను పేస్టు చేసి పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక పాత్ర తీసుకోని అందులొ నూనె వేసి జీడిపప్పు, జీలకర్ర చిన్నచిన్నముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేసి కొద్దిసేపు వేగించాలి. అవి గోధుమరంగులోకి వచ్చాక పసుపు, టమోటా ముక్కలు పూదీనా మిశ్రమాన్నివేసి ఐదునిమిషాల పాటు వేగనివ్వాలి. Step 4 ఉడికిన కొర్రలను నీళ్లు అన్ని వడకట్టి (తడి లెకుండా) ఒక ప్లేట్‌లో పోసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉడికిన కొర్రలు, తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు వేగించి స్టౌ మీద నుండి క్రిందకు దించాలి. పుదీనా కొర్రల రైస్‌ రెడీ. Step 5 పుదీనా కొర్రల రైస్‌ను పెసర పప్పుతో తింటె చాలా రుచికరముగా ఉంటుంది.
Yummy Food Recipes
Add