పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు వెజిటేబుల్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఆహార పదార్థానికున్న పేరు వింటేనే మనకు అర్థమైపోతోంది... ఇది ఎంత ఆరోగ్యకరమైనదో! వెజిటేబుల్ బిర్యానీలో రకరకాల వెజిటేబుల్స్ కలిగిన కూరగాయలను వేయడం వల్ల విటమిన్స్ శాతం ఎక్కువగా వుంటాయి. అలాగే మన శరీర శక్తిని పెంపొందించే ఐరన్, ఇతర రసాయనాలు కూరగాయల్లో ఎంతో పుష్కలంగా వుంటాయి కాబట్టి... వెజిటేబుల్ బిర్యానీని ఒక ఆరోగ్యకరమైన వంటకంగా పేర్కొనవచ్చు.
దీనిని తయారుచేయడంలో ఎక్కువ మసాలా ఉపయోగించాల్సిన అవసరం కూడా వుండదు. అరోమా వాసన కలిగిన ఈ ఎక్సొటిక్ రైస్ డిష్.. ఎటువంటి కార్యక్రమాలలోనైనా, వీకెండ్స్ లోనైనా, శుభకార్యాలలోనైనా తయారుచేసుకోవచ్చు. ఈ బిర్యానీని తయారుచేసే విధానం ఎంతో సులభం. పైగా దీనిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు.