Vegetable nilgiri korma By , 2018-05-07 Vegetable nilgiri korma Here is the process for Vegetable nilgiri korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: క్యారెట్ - ఒకటి,క్యాప్సికం - ఒకటి,బంగాళాదుంప - ఒకటి,క్యాలిఫ్లవర్ - కొద్దిగా,బీన్స్ - పది,బఠానీలు - అరకప్పు,ఉల్లిపాయలు - రెండు,టొమాటోలు - రెండు,కొత్తిమీర తురుము- పావుకప్పు,కరివేపాకు - ఒక రెమ్మ,గరం మసాలా - టేబుల్ స్పూన్,నూనె - రెండు టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి సరిపడా, ,మసాలా ముద్ద కోసం :,కొబ్బరి తురుము - అరకప్పు,వెల్లుల్లి - 12,అల్లం - చిన్న ముక్క,ఎండుమిర్చి - 6,ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు,జీలకర్ర - టీస్పూన్,గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు,సోంపు - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా మసాలా ముద్ద కోసం తీసుకున్నవన్నీ ముందు వేయించి చల్లారాక నీళ్ళు చల్లి ముద్ద చేయాలి. Step 2 కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి. వీటిలో తగినన్ని నీళ్ళు పోసి, ఉప్పు వేసి సగం ఉడికే వరకు ఉంచి దించాలి. Step 3 తర్వాత నీళ్ళు వంపేసి ఉంచాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి.  Step 4 టొమాటోలు గుజ్జుగా చేయాలి.   Step 5 బాణలిలో నూనె వేసి కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి మారేవరకు వేయించాలి.    Step 6 తరువాత మసాలా ముద్ద వేసి వేయించాలి.    Step 7 ఇప్పుడు ఉడికించిన కూరగాయ ముక్కలు, టొమాటో గుజ్జు వేసి కలపాలి. తరువాత రెండు కప్పుల నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి.    Step 8 తరువాత గరం మసాలా చల్లి దించాలి.            
Yummy Food Recipes
Add