fish curry By , 2018-03-12 fish curry Here is the process for fish curry making .Just follow this simple tips Prep Time: 35min Cook time: 25min Ingredients: చేపల ముక్కలు : అర కేజీ,జీలకర్ర - ఒక టీ స్పూన్,ధనియాలు - ఒక టీ స్పూన్,ఎండు మిరపకాయలు - రెండు,కొబ్బరి తురుము - అర కప్పు,మెంతులు - పావు స్పూన్,ఉల్లిపాయలు - అర కప్పు,టమోటాలు - అర కప్పు,చింతపండు గుజ్జు - అర కప్పు,కొత్తిమీర తరుగు - పావు కప్పు,నూనె, ఉప్పు - రుచికి తగినంత,నానబెట్టేందుకు .. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్- తలా అర స్పూన్.. ఉప్పు-తగినంత, Instructions: Step 1 ముందుగా ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, అల్లం పేస్ట్ శుభ్రం చేసిన చేపల ముక్కలకు పట్టించి 20 నిమిషాలు పక్కన వుంచుకోవాలి. Step 2 మూకుడులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడిచేసి, జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు, కొబ్బరి తురుము ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. Step 3 వీటిని కప్పు నీరు పోసి రుబ్బుకోవాలి. Step 4 మూకుడులో మిగతా నూనె వేసి కరివేపాకు, మెంతులు వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయలు కలిపి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి.    Step 5 టమేటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించి, రుబ్బుకున్న పేస్ట్, అరకప్పు నీరు, చింతపండు గుజ్జు, ఉప్పు కలిపి ఉడికించాలి.   Step 6 తర్వాత చేపల ముక్కలు వేసి మెత్తబడేవరకు సుమారు ఐదు నిమిషాలు ఉడికించి కొబ్బరిపాలు పోయాలి.   Step 7 మరో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసి.. వేడి వేడి రైస్‌తో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.           
Yummy Food Recipes
Add
Recipe of the Day