bread vada By , 2017-12-22  bread  vada Here is the process for bread vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బ్రెడ్‌స్లైసులు - ఎనిమిది,,నూనె - వేయించేందుకు సరిపడా,,కొబ్బరితురుము - మూడు టేబుల్‌స్పూన్లు,,ఉప్పు - తగినంత,,అల్లం, పచ్చిమిర్చి తరుగు - రెండు చెంచాలు,,బాదం పలుకులు - రెండు చెంచాలు,,పెరుగు - ఒకటిన్నర కప్పు, తీపి చట్నీ - పావుకప్పు,,కారం - అరచెంచా,,కొత్తిమీర తరుగు - పావుకప్పు.,,తీపి చట్నీ కోసం:,ఖర్జూరాలు - పన్నెండు, చింతపండు గుజ్జు - పెద్ద చెంచా,,బెల్లం - చిన్న ముక్క,,కారం - ముప్పావుచెంచా,,చాట్‌మసాలా - అరచెంచా,,జీలకర్రపొడి - చెంచా,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా తీపి చట్నీ తయారు చేసుకోవాలి. ఖర్జూరాల్లో గింజలు తీసేసి ముక్కల్లా కోయాలి. ఈ ముక్కలకు చింతపండు గుజ్జు కలిపి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ గుజ్జులో మిగిలిన పదార్థాలన్నీ వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. Step 2 దీన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి.. దగ్గరకు అయ్యాక దింపేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో కొబ్బరి తురుమూ, కొద్దిగా ఉప్పూ, పచ్చిమిర్చీ, అల్లం తరుగూ, బాదం పలుకులు తీసుకుని అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్‌ స్లైసుల్ని గుండ్రంగా కత్తిరించుకోవాలి.  Step 3 ఒకదానిలో ఒకటిన్నర చెంచా కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి.. అర్థచంద్రాకారంలో వచ్చేలా తడి చేత్తో అంచుల్ని మూసేయాలి. ఇలానే మిగిలినవీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించి తీసుకోవాలి. వీటిని ఓ వెడల్పాటి పళ్లెంలో సర్దుకోవాలి. Step 4 ఓ గిన్నెలో పెరుగూ, కారం, కొద్దిగా ఉప్పు కలిపి బాగా గిలకొట్టాలి. దీన్ని బ్రెడ్‌స్లైసులపై వేసి.. పైన తీపి చట్నీ కొద్దికొద్దిగా వేయాలి. చివరగా కొత్తిమీర అలంకరిస్తే సరిపోతుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day