majjiga pulusu By , 2017-12-02 majjiga pulusu Here is the process for majjiga pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మజ్జిగ అర లీటరు,ఆనపకాయ ముక్కలు 1 కప్పు,వంకాయలు 2,బెండకాయలు 2,టమాటో 1,పచ్చిమిర్చి 2,సెనగపిండి 3స్పూన్స్,పసుపు కొంచెము,ధనియాల పొడి 1 స్పూన్,కొబ్బరి కోరు 4స్పూన్స్,ఉప్పు,సరిపడా,కొత్తిమీర,తగినంత,కరివేపాకు,మునగ కాడ 1, Instructions: Step 1 కూరముక్కలను ఒక గిన్నె లో వేసుకుని ముక్కలకు సరిపడే నీళ్ళూ పోసిస్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తరువాత బాగాచల్లారనివ్వాలి .  Step 2 ఒక గిన్నెలోకి మజ్జిగ తీసుకుని అందులో పసుపు ,ధనియాల పొడి ( శనగపప్పు 2స్పూన్స్ ,మినప పప్పు 2 స్పూన్స్ ,ధనియాలు 2 స్పూన్స్ మిరియాలు 2 , ఎండు మిరపకాయ ఒకటి , వేఇంచి గ్రైండ్ చేసిన పొడి ), కొబ్బరి కోరు , సెనగపిండి , ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి . Step 3 దీంట్లో చల్లారిన కూరముక్కలను వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి . Step 4 మంట సిం లో ఉండేలా చూసుకోవాలి , మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి .   Step 5 ఆవాలు జీలకర్ర మెంతులు, ఎండు మిరపకాయ , పచ్చి మిరపకాయ , ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.    Step 6 పోపును కూడా వేసి బాగా కలుపుకోవాలి . కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఘుమఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.          
Yummy Food Recipes
Add