vamu charu By , 2017-12-01 vamu charu Here is the process for vamu charu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: చింతపండు- పెద్ద నిమ్మకాయంత,,ఉల్లిపాయ -1,,పచ్చిమిర్చి-3,,కారం-1 టేబుల్ స్పూన్,,పసుపు-కొద్దిగా,,ఉప్పు-తగినంత,,కరివేపాకు-2 రెమ్మలు,,వెల్లుల్లి-2 రెబ్బలు,,జీలకర్ర-1/2 టీస్పూన్,,వాము-1 టేబుల్ స్పూన్,,కొత్తిమీర-తగినంత,,ఎండు మిర్చి-1,,నూనె-2 టేబుల్ స్పూన్స్,,పచ్చిపప్పు-1 టీస్పూన్., Instructions: Step 1 ముందుగా చింతపండుని ఒక గిన్నెలో వేసి నీరు పోసి 5 నిమిషాలు నాన పెట్టుకుని బాగా పిసికి రసం తీసుకోవాలి.  Step 2 తరువాత మిగిలిన పిప్పిని తీసి వేసి పులుపు సరి చూసుకుని కావాలి అంటే మరికొంచెం నీరు పోసుకుని ఉప్పు,కారం,పసుపు వేసి చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి.  Step 3 తరువాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర,పచ్చి పప్పు,వాము,కరివేపాకు,ఎండు మిర్చి వేసి వేగాక పొడవుగా కోసుకున్న ఉల్లిపాయముక్కలు ,పచ్చి మిర్చి,వెల్లుల్లి వేసి ఉప్పు చల్లి 3 నిమిషాలు వేయించుకుని ,ఈ పోపుని మరుగుతున్న చింతపండు రసంలో వేసి కలిపి,కొత్తిమీర చల్లి మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరం మరియు రుచికరం అయిన వాము చారు సిద్ధం.                        
Yummy Food Recipes
Add