cabbage bread mirch recipe By , 2017-11-02 cabbage bread mirch recipe Here is the process for cabbage bread mirch recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: క్యాబేజీ - అర కేజీ,పచ్చి బఠాణీలు - ఒక కప్పు,కొబ్బరి - మూడు కప్పులు,అల్లం - చిన్న ముక్క,పచ్చి మిర్చి - పది,బ్రెడ్ - ఒక ప్యాకెట్,శనగపిండి - నాలుగు కప్పులు,బియ్యపుపిండి - ఒక కప్పు,ఉప్పు - తగినంత,పోపు దినుసులు - రెండు స్పూన్లు,చింతపండు - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా క్యాబేజీ తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి నూరి ఉంచాలి. అలాగే పచ్చి బఠాణీలు కూడా ఉడికించాలి.  Step 2 ఇప్పుడు ఒక బాణలీలో నూనె పోయాలి. నూనె కాగిన తరువాత పోపు దినుసులు వేయించాలి.  Step 3 తర్వాత అందులో క్యాబేజీ వేసి ఉడికించాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి వేసి వేగనివ్వాలి.  Step 4 దీనిలో ఉడికించిన పచ్చి బఠాణీలు, ఉప్పు, చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి.   Step 5 క్యాబేజీ కూర రెడీ అయిన తరువాత బ్రెడ్ ముక్కలను నీళ్ళలో ముంచి తీసి రెండు ముక్కల మధ్య క్యాబేజీ కూరను పెట్టి నొక్కి ఉంచాలి.    Step 6 ఇప్పుడు శనగపిండి, బియ్యపుపిండిని బజ్జీల పిండి మాదిరిగా కలపాలి.     Step 7 ఒక బాణలీలో నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో కూరతో నొక్కిన బ్రెడ్  ముక్కలను ముంచి నూనెలో వేసి వేయించాలి.    Step 8 అంతే ఎంతో రుచికరమైన క్యాబేజీ బ్రెడ్ బజ్జీలు సిద్దం. వీటిని టొమేటో సాస్‌లో నంచుకుని తింటే... అబ్బబ్బ... ఆ టేస్టే వేరు!          
Yummy Food Recipes
Add
Recipe of the Day