cauliflower biryani recipe By , 2017-09-26 cauliflower biryani recipe Here is the process for cauliflower biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పులు,నీరు - మూడు కప్పులు,ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి - ఈ రెండిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి,టొమాటో గుజ్జు - అర కప్పు,పచ్చిబఠాణీ - గుప్పెడు,మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ - 1,నెయ్యి లేదా నూనె - టేబుల్ స్పూన్,ఉప్పు - తగినంత,కొత్తిమీర - కొద్దిగా, మసాలాకోసం జీలకర్ర - అర టీ స్పూను,ధనియాల పొడి లేదా,ఏలకులపొడి - టీ స్పూను,పసుపు - చిటికెడు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,బిరియానీ మసాలా - టేబుల్ స్పూను, Instructions: Step 1 మూడు కప్పుల నీటిలో బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి. ఉడుకుతుండగా కొద్దిగా ఉప్పు వేసి ఉడికిన అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి.  Step 2 బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.  Step 3 తరవాత మసాలాదినుసులు వేసి, ఘుమ ఘుమలాడే వాసన వచ్చేవరకు వేయించాలి.  Step 4 తరవాత టొమాటో గుజ్జు, పచ్చిబఠాణీ, క్యాలీఫ్లవర్ తరుగు వేసి కలపాలి.    Step 5 ఈ పదార్థాలన్నీ మెత్తబడేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీరు చిలకరించాలి.    Step 6 తరవాత ఉడికించుకున్న అన్నంలో ఈ పదార్థాలను కలపాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add