Roasted Chicken recipe By , 2017-09-11 Roasted Chicken recipe Here is the process for Roasted Chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour 40min Ingredients: చికెన్ - ఒకటి,తాజా హెర్బల్ ఆకులు - అరకప్పు (రోజ్ మేరి, కొత్తిమీర, సేజ్, వాము, పూదీన),ఉప్పు - రుచికి సరిపడా,మిరియాలు - రుచికి సరిపడా,నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు,నూనె - 3 టేబుల్ స్పూన్లు,కిచెన్ కింగ్ మసాలా - టేబుల్ స్పూన్,కారం - టేబుల్ స్పూన్, ,స్టఫింగ్ కోసం :,నిమ్మకాయ - అర చెక్క,వెల్లుల్లి - కొన్ని,రోజ్ మేరి - చిన్న కొమ్మ, Instructions: Step 1 ఓవెన్ ను ముందుగానే 180 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేయాలి.  Step 2 చికెన్ పైన ఉన్న తోలు, లోపల ఉన్న కొవ్వు తీసేయాలి. తరువాత శుభ్రముగా కడిగి పలుచని బట్టతో తడి లేకుండా అద్దాలి. Step 3 తాజా ఆకులన్నీ సన్నగా తరగాలి. Step 4 ఓ చిన్న గిన్నెలో ఆకుల తురుము, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె, కిచెన్ కింగ్, కారం వేసి కలపాలి.   Step 5 కోడి పొట్ట లోపల నిమ్మచెక్క, వెల్లుల్లి రెబ్బలు, రోజ్ మేరి ఉంచాలి.   Step 6 ఇవి తినడానికి కాదు కేవలం మంచి వాసనా కోసం మాత్రమే.   Step 7 ఇప్పుడు తాజా ఆకుల తురుముని కోడికి అన్ని వైపులా పట్టించాలి.   Step 8 ఛాతి దగ్గర చర్మం వదులుగా లాగి లోపల కూడా పట్టించాలి. కాళ్ళని మందపాటి దారంతో కట్టేసి బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్ లో సుమారు గంట నుంచి గంటన్నర సేపు రోస్ట్ చేయాలి.    Step 9 మధ్యమధ్యలో చికెన్ నుంచి కారిన జ్యూస్ ను అడ ఎండిపోకుండా చికెన్ కు పట్టిస్తూ ఉండాలి.    Step 10 మొత్తం రోస్ట్ అయ్యాక దాన్ని అలాగే పదిహేను నిముషాలు ఉంచాలి. బయటకి తీసి పొట్టలోపల ఉంచినవన్నీ తీసేయాలి. ఇప్పుడు దీన్ని కావలసినట్లుగా ఏ భాగానికా భాగాన్ని విడతీసి వడ్డించాలి.    
Yummy Food Recipes
Add