Grandma Chicken Roll recipe By , 2017-09-11 Grandma Chicken Roll recipe Here is the process for Grandma Chicken Roll making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉడికించిన చికెన్ : 150 గ్రాములు,వెల్లుల్లి ముక్కలు : ఒక టీస్పూన్,ఉల్లిపాయ : పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి ),పచ్చిమిరపకాయలు : రెండు లేదా మూడు,క్యాప్సికం : 2 (ముక్కలుగా చేసుకోవాలి ),కారం : రెండు టీస్పూన్లు,వైట్ సాస్ : కొద్దిగా,బ్రెడ్ ముక్కలు : 2,నూనె : 15 ml,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా చికెన్ సన్నని ముక్కలుగా కట్ చేయాలి.  Step 2 ఒక ప్యాన్ లో నూనె వేసి, బాగా కాగిన తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.  Step 3 తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉడికించి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి.  Step 4 ఆ తర్వాత కారం పొడి, వైట్ సాస్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.    Step 5 ఒక గిన్నె లో కొద్దిగా నీళ్ళు తీసుకొని బ్రెడ్ ముక్కల్ని నానబెట్టాలి.    Step 6 తర్వాత నీటిని పిండేసి బ్రెడ్ ముక్కలఫై మద్యలో చికెన్ మిశ్రమము ఉంచి, బ్రెడ్ ను మడిచేసి రోల్ చేసుకోవాలి.    Step 7 ఒక భాండి లో నూనె పోసి వేడి అయిన తర్వాత రోల్ చేసిన బ్రెడ్ ముక్కలని వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి.    Step 8 వేగాక ఒక్కొక్క రోల్ ని రెండు గా కట్ చేసుకోవాలి. దీనికి టమాటో కెచప్ మంచి కాంబినేషన్.          
Yummy Food Recipes
Add