gobi manchuria recipe By , 2017-05-18 gobi manchuria recipe Here is the process for gobi manchuria making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: కాలీఫ్లవర్ - 1,,మైదా - 3/4 కప్పు,,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్స్,,కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,,ఆలుగడ్డ - 1,,ఉల్లిగడ్డ -1,,అజినామొటో - పావు టీ స్పూన్,,పచ్చిమిరపకాయలు - 2,,టమాటా సాస్ - 2 స్పూన్స్,,సోయాసాస్ - 2 స్పూన్స్,,కొత్తిమీర - అర కట్ట,,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 గోబీని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, నీళ్లు పోసి కలిపి పేస్ట్‌లా చేయాలి. Step 2 ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కడాయిలో నూనె పోయాలి. Step 3 కలిపి పెట్టుకున్న మిశ్రమంలో గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. Step 4 ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి.    Step 5 ఇందులో అజినామొటో, సోయాసాస్, టమాటా సాస్ వేసి కలపాలి.   Step 6 ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న గోబీని ఇందులో వేసి మరికాసేపు కలియబెట్టాలి.    Step 7 చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. గార్నిష్ చేసిన గోబీ మంచురియా మీ నోరూరించక మానదు!          
Yummy Food Recipes
Add