Veg Vada recipe By , 2017-05-02 Veg Vada recipe Here is the process for Veg Vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మినప్పప్పు - 300 గ్రా.,బియ్యం - 2 టేబుల్ స్పూన్లు,క్యారెట్ - 100 గ్రా.,బీన్స్ - 100 గ్రా.,పచ్చి బఠానీ - 100 గ్రా.,ఉల్లిపాయలు - 5 (పెద్దవి),పచ్చిమిరపకాయలు - 3,డాల్డా - 1 స్పూన్,అల్లం - చిన్న ముక్క,కొత్తిమీర - కొంచెం,కరివేపాకు - కొంచెం,నూనె - వేయించడానికి సరిపడా,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా మినప్పప్పులో బియ్యం కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టాలి.  Step 2 మరోవైపు క్యారెట్, బీన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.  Step 3 తర్వాత నానబెట్టిన మినప్పప్పును గ్రైండర్ లో వేసి రెండు నిముషాలు రుబ్బాలి.  Step 4 తర్వాత పచ్చిమిరపకాయలను, అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి వడలకు కలిపే పిండిలా కలుపుకోవాలి.    Step 5 రుబ్బిన పిండిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను, పచ్చి బఠానీలను, డాల్డాను వేసి బాగా కలపాలి.   Step 6 అనంతరం స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి.   Step 7 నూనె బాగా కాగిన తర్వాత కూరగాయలు చేర్చిన మినప్పప్పు పిండిని వడలాగా తట్టి కాగుతున్న నూనెలో వేసి బాగా వేయించాలి.  Step 8 ఇంకేముంది నోరూరించే వెజ్ వడలు రెడీ. వీటిని పచ్చి కొబ్బరి చట్నీతో గాని, ఎండు మిరపకాయ చట్నీతో గాని తినవచ్చు.
Yummy Food Recipes
Add