Paneer Kulcha recipe By , 2017-04-28 Paneer Kulcha recipe Here is the process for Paneer Kulcha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా - 2 కప్పులు,,పాలు - అర కప్పు,,పెరుగు - పావు కప్పు,,చక్కెర - అర టీ స్పూన్,,బేకింగ్ పౌడర్ - 3/4 టీ స్పూన్,,నువ్వులు - 3 టీ స్పూన్స్,,నెయ్యి - 2 స్పూన్స్,,తురిమిన పన్నీర్ - పావు కప్పు,,ఉల్లిగడ్డ - 1,,పచ్చిమిరపకాయలు - 2,,చాట్‌మసాలా - ఒక టీ స్పూన్,,కారం - ఒక టీ స్పూన్,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 పాలను వేడిచేసి చల్లార్చుకోవాలి. మైదాలో బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి.  Step 2 దీంట్లో చక్కెర, చల్లని పాలు, పెరుగు వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి.  Step 3 దీనిపై ఒక మెత్తని వస్త్రం కప్పి రెండు గంటల పాటు పక్కన పెట్టాలి. Step 4 ఈలోపు పచ్చిమిరపకాయలను, ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకోవాలి.    Step 5 ఒక గిన్నెలో పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి.    Step 6 ఇప్పుడు మైదాను తీసుకొని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి.    Step 7 దీంట్లో పన్నీర్ మిశ్రమాన్ని పెట్టి మళ్లీ చిన్న ముద్దలా చేయాలి. మళ్లీ కొద్దిగా పిండి, నువ్వులు వేస్తూ చపాతీల్లా చేసుకోవాలి.    Step 8 ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేస్తూ సన్నని మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి.    Step 9 వేడి.. వేడి.. పన్నీర్ కుల్చా రెడీ! వీటిని బఠాణీలతో చేసినా ఏ కూరతోనైనా లాగించేయొచ్చు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day