Spicy Egg Curry recipe By , 2017-04-04 Spicy Egg Curry recipe Here is the process for Spicy Egg Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడిగుడ్లు : నాలుగు,పచ్చిమిరపకాయలు : రెండు,ఉల్లిపాయలు : రెండు పెద్దవి,టమోటాలు : రెండు పెద్దవి,మిరియాల పొడి : అర టీస్పూన్,కారం పొడి : అర టీస్పూన్,అల్లం : చిన్న ముక్క,పోపు గింజలు : అర టీస్పూన్,వెల్లుల్లిపాయలు : ఆరు పాయలు,నూనె : నాలుగు టేబుల్ స్పూన్లు,నిమ్మరసం : నాలుగు చుక్కలు,ఉప్పు : సరిపడా, Instructions: Step 1 మొదట కోడిగుడ్లను కొట్టి బాగా బీట్ చేసుకొని అందులో మిరియాల పొడి, ఉప్పు కలుపుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి.  Step 2 తర్వాత దాన్ని కుక్కర్ లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి.  Step 3 ఈలోపు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.  Step 4 బాణలిలో నూనె వేసి అందులో పోపు గింజలు వేసి వేయించుకోవాలి.  Step 5 తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చి రెండు నిముషాలు ఉడికించాలి.  Step 6 అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.  Step 7 అనంతరం టమాటో ముక్కలు, కారం, పచ్చిమిర్చి ముక్కలను వేసి మూత పెట్టి మూడు నిముషాలు ఉడికించుకోవాలి.  Step 8 ఈ కూరలో కుక్కర్ లో ఉడికించి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని కావలసిన సైజ్ లో కట్ చేసుకొని వేసుకోవాలి.  Step 9 చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని దించేయాలి.  Step 10 అంతే ఘుఘుమలాడే స్పైసీ ఎగ్ కర్రీ రెడీ. కోడిగుడ్డులో పచ్చసొనను తినేందుకు ఇష్టపడని వారు ఇలా చేసుకొని ఆరగించవచ్చు.  Step 11 ఈ స్పైసీ ఎగ్ కర్రీని చపాతీలలోకి, దోసేల్లోకి సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు. అన్నంతో కూడా తినవచ్చు.   
Yummy Food Recipes
Add