ghee pulav recipe By , 2017-03-20 ghee pulav recipe Here is the process for ghee pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతి బియ్యం- 2 కప్పులు (రైస్ కుక్కర్ కప్),,నెయ్యి -2 టేబుల్ స్పూన్స్,,ఉల్లిపాయ -1,,పచ్చిమిర్చి -2/3,,కొత్తిమీర -3 రెమ్మలు ,,పుదీనా -2 రెమ్మలు,,కరివేపాకు -2 రెమ్మలు,,అల్లం వెల్లులి పేస్ట్ -1 టేబుల్ స్పూన్,,జీడిపప్పులు - 5/8,,చెక్క -1 అంగుళం ,,లవంగాలు -3,,యాలకలు -3,,మరాఠి మొగ్గ -1,,అనాసపువ్వు -1,,ఉప్పు -1 స్పూన్ ,,పసుపు - 1/4 టీస్పూన్., Instructions: Step 1 కుక్కర్ గిన్నె/రైస్ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి పోయాలి. Step 2  నెయ్యి వేడి అయ్యాక చెక్క ,లవంగాలు, యాలకలు, మరాఠి మొగ్గ, అనాసపువ్వు వేసి ఒక నిమిషం వేపుకోవాలి.  Step 3 తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ,కరివేపాకు మరియు జీడిపప్పు వేసి ఒక నిమిషం వేగాక అల్లంవెల్లులి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేపుకోవాలి (సుమారు 2 నిమిషాలు).  Step 4 తర్వాత బియ్యం వేసి ఒకసారి కలపాలి.  Step 5 ఉప్పు మరియు పసుపు వేసి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి కొత్తిమీర మరియు పుదీనా వేసి కుక్కర్ మూతపెట్టి మూడు విస్టల్స్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.  Step 6 లేదంటే రైస్ కుక్కర్ లో పెట్టవచ్చు. ఈ రైస్ ని కుర్మాతో కానీ చినెన్ కర్రీతో గాని తింటే బాగుంటుంది.
Yummy Food Recipes
Add