aloo parata recipe By , 2017-03-18 aloo parata recipe Here is the process for aloo parata making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉడికించిన బంగాళాదుంపలు- 4, , సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు- 1/2 కప్పు, , సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2, , గోధుమ పిండి-1 కప్పు, , కారం-1 టీస్పూన్, , చాట్ మసాలా-1 టీస్పూన్, , ఆంచూర్ పొడి -1/2 టీస్పూన్. , నెయ్యి/నూనె -తగినంత, , కొత్తిమీర -తగినంత, , జీలకర్ర పొడి-1/2 టీస్పూన్ , ధనియాల పొడి-1/2 టీ స్పూన్., Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నూనె వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనిచ్చి, దానిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆంచూర్ పొడి వేసి 1 నిమిషం వేయించి బంగాళాదుంపలను చిదుముకుని వేసి ,ఉప్పు, కారం వేసి అన్ని కలిసేట్టు కలుపుకోవాలి . Step 3 ఈ మిశ్రమాన్నీ మెత్తగా గుజ్జులా మెదుపుకోని చల్లారనివ్వాలి. తరువాత గోధుమ పిండి ముద్దని తీసుకుని చివరలు పలుచగా మధ్యలో మందంగా ఉండేట్టు గుండ్రంగా వత్తుకోవాలి . Step 4 ఇలా వత్తుకున్న చపాతీ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్నీ ఉంచి మూసివెయ్యాలి. Step 5 తరువాత చపాతీ కర్రతో వత్తుతు లోపల పెట్టిన మిశ్రమం బయటికి రాకుండా సమంగా ఉండేట్టు నెమ్మదిగా గుండ్రంగా చేసుకోవాలి. Step 6 పిండి అంటుకోకుండా ఉండాలి అంటే పొడి గోధుమపిండి చల్లుకుంటూ ఉండండి. Step 7 ఇలా తయారు అయిన పరాటాలని పెనం మీద నెయ్యి వేసి రెండు వేపులా మీడియం మంట మీద కాల్చుకొని తీసుకోవాలి. అంతే వేడి వేడి ఆలూ పరాట సిద్ధం .    
Yummy Food Recipes
Add
Recipe of the Day