Mutton Korma recipe By , 2017-03-06 Mutton Korma recipe Here is the process for Mutton Korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్ ముక్కలు - కేజీ,ఉల్లిపాయలు - 4 (సన్నగా తరగాలి),పెరుగు - 3 కప్పులు,కారం - 2 టేబుల్ స్పూన్లు,ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు,పసుపు - టీ స్పూన్,జీలకర్ర పొడి - పావు టీ స్పూన్,లవంగాలు - 5,ఏలకులు (పచ్చవి) - 6,దాల్చినచెక్క - అంగుళం,కుంకుమపువ్వు - కొన్నిరేకలు,ఉప్పు - తగినంత,అల్లం పేస్ట్ - టీ స్పూన్,వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,నూనె - కప్పు,నెయ్యి - అర కప్పు,ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు,, Instructions: Step 1 పాన్‌లో నూనె వేసి, ఉల్లిపాయలను గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. Step 2 బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలను కిచెన్ పేపర్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు క్రిస్పీగా తయారయ్యాక వాటిని మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. Step 3 అదే పాన్‌లో మరికొంచెం నూనె వేసి మటన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కలిపి, ఆరు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. Step 4 దీంట్లో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, నల్లమిరియాల పొడి, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్రపొడి, పెరుగు, రెండు కప్పుల నీళ్లు కలిపి అరగంట సేపు సన్నని మంట మీద ఉడికించాలి. Step 5 ఉల్లిపాయ పొడి వేసి కలపాలి. ముక్క ఉడికి, నూనె పైకి తేలుతునప్పుడు కుంకుమపువ్వు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి కలిపి మూత పెట్టి మరో పదిహేను నిముషాలు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. Step 6 నోరూరించే మటన్ కుర్మాను వేడి వేడిగా నాన్ లేదా చపాతీలోకి వడ్డించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day