Egg Drop Curry recipe By , 2017-04-18 Egg Drop Curry recipe Here is the process for Egg Drop Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గుడ్లు - 4,నెయ్యి - టేబుల్ స్పూన్,ఉల్లిపాయ - ఒకటి,వెల్లుల్లి రెబ్బలు - 2,కొబ్బరి పాలు - అర కప్పు,ఉప్పు - తగినంత,టమాటా - 1,,మసాలా కోసం :,కాశ్మీరీ మిర్చి - 6,ధనియాలు - 2 టీ స్పూన్లు,జీలకర్ర - టీస్పూన్,పసుపు - అరటీస్పూన్,కొబ్బరి తురుము - 4 టేబుల్ స్పూన్లు,చింతపండు - నిమ్మకాయంత,వెల్లుల్లి రెబ్బలు - రెండు, Instructions: Step 1 ముందుగా మసాలా కోసం తీసుకున్నవన్ని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి మెత్తగా రుబ్బాలి.  Step 2 వెడల్పాటి పాన్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. Step 3 తర్వాత టమాటా ముక్కలు వేయాలి. వేగాక మసాలా వేసి బాగా కలపాలి.  Step 4 ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి.    Step 5 తర్వాత కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు గుడ్లను పగలకొట్టి సొనను జాగ్రత్తగా కూరలో వేయాలి.     Step 6 ఈ సొనలు ఒకదానికొకటి తగలకుండా, చెదిరిపోకుండా జాగ్రత్తగా వేయాలి.    Step 7 ఇప్పుడు నెమ్మదిగా ఓ స్పూన్ గ్రేవీ ని గుడ్ల సొన మీద వచ్చేలా కప్పాలి.    Step 8 ఇప్పుడు సొనలు ఉడికే వరకు కదపకుండా ఉడికించుకోవాలి.  Step 9 తర్వాత కొబ్బరి పాలు పోసి మెల్లగా కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడికాయి అనుకున్న తర్వాత కొత్తిమీర తురుము చల్లి దించాలి. ఈ ఎగ్ డ్రాప్ కర్రీను గోవావాసులు ఎక్కువగా చేసుకుంటారు.       
Yummy Food Recipes
Add
Recipe of the Day