Munnakaya Pappucharu Recipe By , 2017-02-14 Munnakaya Pappucharu Recipe Here is the process for Munnakaya Pappucharu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మునక్కాయలు -2,కందిపప్పు - 1 కప్పు,టమాటో - 1,ఉల్లిపాయ - 1,పచ్చిమిర్చి - 4,నూనె - 4 స్పూన్స్,పోపు గింజలు - 2 స్పూన్స్,సాంబార్ పొడి - 1 స్పూన్,చింతపండు - కొద్దిగా,పసుపు - 1/2 స్పూన్,కారం - 1 స్పూన్,ఉప్పు - సరిపడ, Instructions: Step 1 ముందుగా పప్పను కడిగి విడిగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మునక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలు చేసుకోవాలి. Step 2 ఇప్పుడు ఈ ముక్కల్లో నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరువాత చింతపండు రసం పోసి మరి కొద్ది సేపు ఉడికించాలి.బాగా ఉడికిన తరువాత దించి పక్కనపెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక పోపు గింజలు, మరో ఉల్లిపాయ, టొమోటో ముక్కలు, కారం, పసుపు వేసి వేగాక ఈ పోపుని ముందుగ ఉడికించిన పులుసులో వేసి మరి కొద్దిగా నీళ్ళు పోసి పప్పు మిశ్రమాన్ని కూడా వేసి కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. Step 4 బాగా మరుగుతున్నప్పుడు అందులో సాంబార్ పొడి, కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే వేడి వేడి మునక్కాయ పప్పుచారు సిద్ధం.  
Yummy Food Recipes
Add