Egg less Cake recipe By , 2017-02-09 Egg less Cake recipe Here is the process for Egg less Cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: మైదా: 1 కప్పు,కండెన్స్డ్ మిల్క్: ½ కప్పు,పంచదార పౌడర్: ¼ కప్పు,జీడిపప్పు: 25 గ్రామ్స్,కిస్మిస్ : 10,బేకింగ్ సోడా: ¼ చెంచా,బేకింగ్ పౌడర్: ½ చెంచా,బట్టర్: ¼ కప్పు,పాలు: ½ కప్పు,ఉప్పు: చిటికెడు,వెనిలా ఎసెన్స్: 4 డ్రాప్స్, Instructions: Step 1 ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ లను బాగా మిక్స్ చేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి. Step 2 తర్వాత ఇందులో పంచదార పొడి మరియు బట్టర్ రెండూ వేసి బట్టర్ స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేయాలి . ఇందులోనే కండెన్డ్ మిల్క్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి. పాలు కూడా పోసి మొత్తం మిశ్రమం స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి. Step 3 కేక్ మేకర్ తీసుకొని గిన్ని మొత్తం బట్టర్ రాయాలి, దాని మీద ఒక టేబుల్ స్పూన్ మైదాను చిలకరించాలి Step 4 ఇప్పుడు పిండి మిశ్రమంలో జీడిపప్పు మరియు కిస్మిస్, వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్ చేసి బేకింగ్ బౌల్లో వేసుకోవాలి . Step 5 ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తక్కువ మంట మీద 45 నిముషాలు ఉడికించుకోవాలి. 45 నిముషాల తర్వాత మూత తీసి బేకింగ్ బౌల్లో కేక్ మొత్తం, అన్ని వైపులా బ్రౌన్ కలర్ లోకి మారిందో లేదో సరిచూసుకోవాలి. Step 6 తర్వాత చాకును కేకు లోపలికి గుచ్చి చూడాలి. పైకి తీసినప్పుడు , సులువగా చాకు బయటకు వస్తే కేక్ తయారైనట్లే. అలా కాకుంటే మరో 10నిముషాలు తక్కువ మంట మీద తిరిగి ఉడికించు కోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. Step 7 చల్లారిన తర్వాత బేకింగ్ బౌల్ ను ఒక సర్వింగ్ ప్లేట్ మీద బోర్లించి కేక్ ను జాగ్రత్తగా తీసుకోవాలి . కేక్ మొత్తం బయటకు తీసుకొన్న తర్వాత మనకు నచ్చిన ఆకారం లో కట్ చేసుకోవాలి. అంతే అందరూ ఎంతో ఇష్టంగా తినే ఎగ్ లెస్ కేక్ రెడీ…
Yummy Food Recipes
Add