semiya chicken biryani By , 2017-01-19 semiya chicken biryani Here is the making process for mouthwatering semiya chicken biryani Prep Time: 20min Cook time: 45min Ingredients: సేమియా -  అర కేజి, ,నిమ్మకాయ  -1 ,చికెన్‌ - అర కేజి, ,పచ్చిమిర్చి -10గ్రా, ,దాల్చిన చెక్క-   1,లవంగాలు  -   6,ఉల్లిపాయలు -  2,నూనె -   తగినంత, ,కొత్తిమీర  -6 రెబ్బలు, ,అల్లంవెల్లుల్లి ముద్ద- 20గ్రా, ,ఉప్పు -తగినంత, ,బిర్యానీ ఆకు -   10గ్రా, ,యాలకులు  -   2,జీడిపప్పు  -  200గ్రా,, Instructions: Step 1ముందుగా స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోయాలి. అందులో సేమియా వేసి, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను నూనె వేసి అయిదు నిమిషాలు ఉంచి దించేయాలి.  Step 2తడి బట్ట తీసుకుని ఉడికిన సేమియాను అందులో వేసి వడగట్టాలి. నీరంతా పోయిన తర్వాత సేమియాను ఒక ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి.  Step 3మళ్ళీ స్టవ్‌పై మరో గిన్నె ఉంచి, కొద్దిగా నూనె వేసి, శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్‌ ముక్కలను అందులో వేసి చిన్న మంటపై అయిదు నిమిషాలు ఉడికించాలి.  Step 4లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు అన్ని కలిపి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి చికెన్‌పై చల్లి, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపాలి. Step 5చిన్న మంటపై మరో అయిదు నిమిషాలు చికెన్‌ను ఉడికించి, ఆపైన సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే- సేమియా చికెన్‌ బిర్యానీ రెడీ అయినట్లే.
Yummy Food Recipes
Add