here the preparation process for Pndipulihora By , 2016-11-07 here the preparation process for Pndipulihora here the preparation process for moth watering Pndipulihora. Just follow these steps and make delecious pindipulihora Prep Time: 30min Cook time: 15min Ingredients: బియ్యం రవ్వ - రెండు కప్పులు,చింతపండు రసం - అర కప్పు,అల్లం - అంగుళం ముక్క,పచ్చిమిరపకాయలు - పది,ఎండుమిరపకాయలు - పది,పసుపు - ఒక టీ స్పూన్,ఇంగువ - ఒకటిన్నర టీ స్పూన్,ఉప్పు - రెండు టీ స్పూన్స్,కరివేపాకు -- ఆరు రెమ్మలు,నూనె - రెండు టేబుల్ స్పూన్స్,జీడిపప్పులు -- 16,సెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్,మినపపప్పు - అర టేబుల్ స్పూన్,ఆవాలు - ఒక టీ స్పూన్, Instructions: ముందుగ మనము బియ్యం రవ్వ కోసం మూడు గ్లాసుల బియ్యం కడిగి ఒక పొడి బట్ట పైన ఆరబోయ్యాలి.తడి ఆరిన బియ్యాన్ని రవ్వ లాగ గ్రైండ్ చెయ్యాలి.తరవాత గ్రైండ్ చేసిన రవ్వను జల్లించాలి.అప్పుడు రవ్వ లోని బియ్యపు పిండి విడిగా వస్తుంది.ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ మిద పెట్టి రెండు కప్పుల రవ్వ తీసుకుంటున్నాము కాబట్టి ,నాలుగు కప్పుల నీళ్ళు పోసి బాగా పొంగు వచ్చేవరకు పొంగ నివ్వాలి.పొంగుతున్న నీళ్ళలో రెండు టీ స్పూన్స్ ఉప్పువేసి కలిపి మళ్లి ఒక పొంగు రానిచ్చి అందులో ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న రెండు కప్పుల బియ్యపు రవ్వను పోసి కలియబెట్టి సన్నని మంట మీద వుడకనివ్వాలి.ఒక ఐదు నిముషాల తరువాత వుడికిన రవ్వను ఒక బేసిన్ లోనికి తీసి ఉండలు లేకుండా ఆరబెట్టాలి .ఇప్పుడు ఒక బాండి తీసుకుని స్టవ్ మిద పెట్టి నూనె పోసి మినపపప్పు,సెనగపప్పు,ఆవాలు,ఎండుమిరప ముక్కలు,ఇంగువ,పసుపు ,పల్లీలు వేసి పోపును దోరగా వేయించాలి.దోరగా వేగిన పోపులో అల్లం పేస్టు ను ,కరివేపాకు,పచ్చిమిరప ముక్కలు వేసి ఒక ఐదు నిముషాలుంచి చింతపండు రసాన్ని పోసి రసం దగ్గర పడేవరకు ఉడక నిచ్చి దించేసి ఇందాక మనము ఆర బెట్టిన రవ్వలొ పోసి బాగా కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే పిండి పులిహొర రెడీ.మనకు ఎప్పుడైనా ఇడ్లీలు ఎక్కువగా మిగిలిపోతే వాటితో కూడా ఇదే విధంగా తయారు చేసుకో వచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day