kesari recipe|tasty special kesari|sweet items By , 2016-05-27 kesari recipe|tasty special kesari|sweet items Jaggery Kesari, How to Prepare Bellam Kesari. Easy to cook and Traditional Recipes, festival special kesari recipe, you can prepare these tasty dishes easily in your homely kitchens. Prep Time: 20min Cook time: 30min Ingredients: ఒక కప్పు సన్న రవ్వ, మూడు స్పూన్లు నెయ్యి, తగినంత బెల్లం, పది గ్రాములు జీడిపప్పు, పది గ్రాములు  కిస్‌మిస్,అర టి స్పూన్  యాలకులపొడి, అర టీ స్పూన్ ‌ కుంకుమ (కలర్ పొడి), Instructions: Step 1 ముందుగా బెల్లం తీసుకొని ఒక ఫ్లేట్ లొకి తురుముకొవాలి. తర్వాత పెన్నం తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి చిన్నమంటమీద వేడి చేస్తూ జీడిపప్పు, కిస్‌మిస్, ను వేగించి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఆపాత్రలోనె కోద్దిగా నెయ్యి వేసి వేడిచేస్తూ రవ్వను కమ్మటి వాసన వచ్చేవరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత క్రిందకు దింపి మరో ఫ్లేట్ లోకి మార్చుకోవాలి. ఆపాత్రలోనె కొన్ని నీళ్లు తీసుకొని అందులో బెల్లం వేసి కరిగేంత వరకు కలుపుతు వుండాలి. బెల్లం కరిగిన తర్వాత క్రిందకు దింపి పక్కన పెట్టుకొవాలి. Step 3 ఇప్పుడు మరొ పాత్ర తీసుకొని అందులో నీళ్లు, కలర్ పొడి వేసి, నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి, రవ్వ వేసి చిన్న మంట మీద కలుపుతు రవ్వను బాగా ఉడికనివ్వాలి. ఇప్పుడు ముందుగా బెల్లం కరిగించి పెట్టుకున్న నీళ్లను వేసి చిన్న మంటమీద బాగా కలపాలి. Step 4 ఇలా కలుపుతు ఉంటే కేసరిలా అవుతుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్, మరియు యాలకుల పొడి వేసి కలపాపి రెండు నిమిషాల తర్వాత స్టౌ మీద నుంచి క్రిందకు దింపాలి. అంతే బెల్లం కెసరి రెడీ.
Yummy Food Recipes
Add