Tomato Rice|special rice items| healthy tomato rice recipe By , 2016-05-23 Tomato Rice|special rice items| healthy tomato rice recipe how to cooking Tomato rice. special cooking items, tomato rice number of ingredients, healthy food recipe. Prep Time: 15min Cook time: 25min Ingredients: అర కిలో  బియ్యం,అర కిలో  టమాటాలు,రెండు  ఉల్లిగడ్డలు,నాలుగు  పచ్చిమిర్చి,అర టీ స్పూన్  గరం మసాల,ఒక కట్ట కొత్తిమీర,చిటికెడు‌  పసుపు,ఐదు‌  యాలకులు,ఒక కప్పు‌  నెయ్యి,టీ స్పూన్‌  కారం,సరిపడా‌  ఉప్పు,రెండు రెబ్బలు‌  కరివేపాకు, Instructions: Step 1 బియ్యం కడిగి నానబెట్టాలి. తాజా టమాటాలను శుభ్రంగా కడిగి పక్కన పట్టుకొవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి చిన్నచిన్నముక్కలుగా కట్ చేసుకొవాలి. Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో టమాటాలు కొన్నినీళ్లు వేసి ఉడికించాలి. ఇప్పుడు టమాటాలు మెత్తబడ్డాక మిక్సిలో వేసి కొద్దిగా అవసరం అయితే కొన్ని నీళ్లు కలిపి టమాటా రసం నాలుగు గ్లాసులు వచ్చేలా తియ్యాలి. Step 3 స్టవ్ వెలిగించి, ఒక పాత్రలో నెయ్యి వేసి కాగిన తరువాత యాలకులు, లవంగాలు, కరివేపాకు వేసి వేగాక, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. Step 4 ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరం మసాల, కొత్తిమీర వేసి కాసేపు వేగనిచ్చి బియ్యం వేసి అర నిముషం వేపాలి. Step 5 తరువాత టమాటా రసం వేసి ఒకసారి కలిపి, మూతపెట్టి పది నిముషాలు పెద్ద మంటమీద ఉడికించి, తరువాత పది నిముషాలు చిన్న మంట మీద ఉడికించాలి. Step 6 ఇప్పుడు స్టవ్ ఆపి కొత్తిమీర చల్లి వేడివేడిగా వున్నప్పుడు వడ్డించాలి. అంతే ఘుమఘుమలాడే టమాట రైస్ రెడి.
Yummy Food Recipes
Add